Current Affairs Telugu Daily

4వ విడత రుణమాఫీ సొమ్ము విడుదల
నాలుగో విడత రుణ మాఫీ సొమ్ము కోసం రైతులు భారీగా బ్యాంకులకు వస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 4.49లక్షల మంది వివిధ బ్యాంకు శాఖల్లో పేర్లు నమోదు చేసుకున్నారు.
వీరికి ఏడాదికి 10 శాతం చొప్పున 30 శాతం వడ్డీతో కలిపి రూ.519 కోట్లను బుధవారం విడుదల చేశారు. సొమ్ము విడుదల చేసిన తొలిరోజే 2.05 లక్షల మంది రైతులు నమోదు చేసుకోగా వారికి రూ.282 కోట్లను బ్యాంకు శాఖలకు పంపారు.  
రూ.450 కోట్లు తీసుకున్న డ్వాక్రా మహిళలుః
పసుపు-కుంకుమ-2 కింద రూ.450 కోట్ల సాయాన్ని డ్వాక్రా మహిళలు బుధవారం బ్యాంకుల నుంచి తీసుకున్నారు. నాలుగో విడతగా రూ.3,980 కోట్లను ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఖాతాల్లో 4, 5, 6 తేదీలలో జమ చేసింది. ఇందులో రూ.2,500 కోట్లను ఇప్పటికే తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకూ రూ.2,900 కోట్ల సాయం చేరినట్లయింది.

views: 1148

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams