Current Affairs Telugu Daily

నకిలీ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌లతో పొందే ఉద్యోగాలు చెల్లవు : సుప్రీం
నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో రిజర్వుడు కేటగిరీలో తెచ్చుకొన్న ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పొందిన ప్రవేశాలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు 2017 జులై 6న స్పష్టం చేసింది. ఎవరైనా వ్యక్తి తగినంత కాలం ఉద్యోగంలో కొనసాగిన తర్వాత అతడు నకిలీ పత్రాలతో ఉద్యోగానికి ఎంపికైనట్లు వెల్లడైతే అతన్ని సర్వీసులో కొనసాగించవచ్చంటూ 2014 డిసెంబరులో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన వ్యాజ్యం, కొన్ని ఇతర వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జగదీశ్‌ సింగ్‌ ఖేహర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఇది పాత తేదీ నుంచి వర్తించదని, ఇప్పటి నుంచి అమలవుతుందని స్పష్టం చేసింది.
views: 1198



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams