Current Affairs Telugu Daily

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్‌

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ నియమితులయ్యారు. ఆయన పేరు ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
*ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
*మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ తాత్కాలికంగా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఇప్పుడు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పేరును కొలీజియం ఖరారు చేసింది.

జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌:

  • జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ప్రస్తుతం అలహాబాద్‌ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా ఉన్నారు.
  • 2004 సెప్టెంబర్‌ 24న అదే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2
  • 006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
  • 2024 సెప్టెంబర్‌ 23 వరకు ఆయన సర్వీసులో ఉండనున్నారు.

views: 1084

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams