Event-Date: | 09-Apr-2019 |
Level: | National |
Topic: | Judiciary and Judgement |
*ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయత, సమగ్రత మరింత పెంచడం కోసం ఓటింగ్ యంత్రాల్లో నమోదయ్యే చీటీల లెక్కింపును పెంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించింది.
* ఈవీఎంలకు అనుసంధానమయ్యే వీవీప్యాట్ యంత్రాల్లోని చీటీలను ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదు బూత్‌లలో లెక్కించాలని స్పష్టం చేసింది.
* లెక్కింపు సంఖ్యను పెంచడం వల్ల అదనంగా మానవ వనరులు, మౌలిక సదుపాయాల అవసరం ఉండదని, ఫలితాల వెల్లడిలో ఆలస్యమూ జరగదని స్పష్టం చేసింది.
*ప్రస్తుతమున్న సెగ్మెంట్‌కు ఒక బూత్‌లో లెక్కించే పద్ధతికి బదులుగా.. ఐదు బూత్‌లకు లెక్కింపు ప్రక్రియను పెంచాలని పేర్కొంది.
*ఈవీఎంలలోని 50 శాతం వీవీప్యాట్ చీటీలను లెక్కించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 21 మంది విపక్ష నేతలు చేసిన డిమాండ్‌కు మాత్రం అంగీకారం తెలుపలేదు.
* ప్రస్తుతం ఒక ఈవీఎంలోని వీవీప్యాట్ చీటీల లెక్కింపునకు ముగ్గురు ఎన్నికల అధికారులు, ఒక రిటర్నింగ్ అధికారి, ఒక పరిశీలకుడిని (సీనియర్ సివిల్స్ అధికారి) వినియోగిస్తున్నామని, నమూనా పరిమాణాన్ని పెంచడం వల్ల మానవ వనరుల సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడింది
* ఈ తరహా ప్రక్రియను పలు అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టినా, లోక్‌సభ ఎన్నికల్లో చేపట్టడం ఇదే తొలిసారి.
* ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు.
Voter Verifiable Paper Audit Trail system