Current Affairs Telugu Daily

భారత వృద్ధి 7.5 శాతం: ప్రపంచ బ్యాంక్‌ అంచనా
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో భారత జీడీపీ వృద్ధి స్వల్పంగా పెరిగి 7.5 శాతానికి చేరొచ్చని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది.
*పెట్టుబడులు బలోపేతం కావడం కొనసాగడం, ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ ఎగుమతులు, వినియోగం పెరగడం కలిసిరావొచ్చని అభిప్రాయపడింది.
* 2018-19లో వాస్తవిక జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదుకావొచ్చని దక్షిణాసియాపై విడుదల చేసిన తాజా నివేదిక ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది.
* ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సమావేశాల ప్రారంభానికి ముందు ఈ నివేదికను విడుదల చేయడం గమనార్హం. 
* మొదటి మూడు త్రైమాసికాలను చూస్తే.. పారిశ్రామిక వృద్ధి 7.9 శాతానికి చేరింది. సేవల రంగం డీలాపడగా, వ్యవసాయ రంగ వృద్ధి 4 శాతంగా నమోదైంది.
* గిరాకీ చూస్తే.. దేశీయంగా వినియోగం వృద్ధికి దన్నుగా నిలిచింది. గత త్రైమాసికంలో అన్ని రంగాల్లో వృద్ధి సమతూకంగా నమోదయ్యే అవకాశం ఉంది.
* 2019-20లో వృద్ధి స్వల్పంగా పుంజుకోవచ్చు. ఆహార ధరలు పుంజుకునే అవకాశం ఉండటంతో ద్రవ్యోల్బణం 4 శాతంగా దిశగా వెళ్లొచ్చు. కరెంటు ఖాతా, ద్రవ్య లోటు తగ్గే అవకాశం ఉంది.
* భారత ఎగుమతులు గణనీయంగా మెరుగుపడ్డాయి.
*. చమురు ధరలు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు జీడీపీలో 1.9 శాతానికి చేరొచ్చు.
*దేశీయంగా ద్రవ్యలోటు సైతం తగ్గుముఖం పట్టొచ్చు. జీడీపీలో లోటు 3.4 శాతంగా నమోదుకావొచ్చు.
* 2018 జులై నుంచి ఆహార ధరలు తగ్గాయి., రూపాయి బలోపేతం కావడంతో ద్రవ్యోల్బణం సైతం తగినది.
* 2018-19లో కరెంటు ఖాతాలోటు మాత్రం మరింత పెరిగింది.

ప్రపంచబ్యాంకు:
  • అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోభివృద్ధికై ధన సాయం చేసందుకు గాను ఏర్పాటయిన సంస్థ 
  • 1945 డిసెంబర్ 27 న ప్రపంచబ్యాంకు ఏర్పాటై, 1946 జూన్ 25 న కార్యకలాపాలు మొదలు పెట్టింది.
  • ప్రధాన కార్యాలయం: వాషింగ్టన్ (D.C) 
  • ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ
వాస్తవానికి ప్రపంచ బ్యాంకు ఐదు అంతర్జాతీయ సంస్థల కూర్పు. ఆ ఐదు సంస్థలు ఇవి:
  • ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవెలప్‌మెంట్ (IBRD)
  • ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (IFC)
  • ఇంటర్నేషనల్ డెవెలప్‌మెంట్ అసోసియేషన్ (IDA)
  • మల్టిలేటరల్ ఇన్వెస్ట్‌మెంట్ గ్యారంటీ అసోసియేషన్ (MIGA)
  • ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిస్ప్యూట్స్ (ICSID)

views: 731

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams