Current Affairs Telugu Daily

నదుల ప్రక్షాళనకు  కార్యాచరణ రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించిన హరిత ట్రైబ్యునల్‌
*కృష్ణా, గోదావరి సహా దేశంలోని అన్ని నదుల ప్రక్షాళనకూ కార్యాచరణ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశించింది.
* తెలంగాణలోని మూసీ నదిని ప్రక్షాళన చేయాలని, ఆక్రమణలను తొలగించాలని తూడి ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం  విచారణ చేపట్టింది.
* మూసీ నది ఆక్రమణలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ రూపొందించలేదని పిటిషన్‌దారు తరఫు న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌.. ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
*నదీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిటీలు రూపొందించిన నివేదికల్లో కొన్ని లోపాల్ని సరిచేయాల్సి ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు కూడా ధర్మాసనానికి వెల్లడించారు.
* సింగపూర్‌ లాంటి దేశాలు కూడా రీసైక్లింగ్‌ చేసిన నీటిని తాగునీటిగా ఉపయోగిస్తున్నాయని అమికస్‌ క్యూరీ కాత్యాయని వివరించారు.
* వాదనల అనంతరం గంగా నది తరహాలోనే దేశంలోని మిగతా నదుల ప్రక్షాళనకూ జూన్‌లోగా కార్యాచరణ నివేదిక తయారుచేసి సమర్పించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ః
  • పర్యావరణాన్ని పరిరక్షించడం, అటవీ సంరక్షణ, పర్యావరణానికి సంబంధించి న్యాయపరమైన హక్కులను పరిరక్షించడం, పర్యావరణానికి హాని కలిగినందువల్ల నష్టపోయిన వారికి పరిహారం అందేట్టు చూడడం ఈ సంస్థ బాధ్యత. 
  • పర్యావరణానికి సంబంధించిన వ్యాజ్యాలను త్వరగా తెమల్చడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 
  • ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను తిరగదోడే అవకాశం కేవలం సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంటుంది.
  • సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అర్హత ఉన్న వారిని ఎవరినైనా ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించవచ్చు
  • ఈ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన బెంచ్ (న్యాయ స్థానం) భోపాల్ లో యేర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక న్యాయ స్ధానంతో సంధానం చేయబడి 4 సర్క్యూట్ న్యాయ స్థానాలు ఉంటాయి.
  • ఈ కోర్టు జల, వాయు, కాలుష్యాలపై గల పర్యావరణ రక్షణ, అడవుల సంరక్షణ మరియు జీవ వైవిధ్య చట్టాలు వంటి అన్ని పర్యావరణ చట్టాలననుసరించి తీర్పును ఇస్తుంది.
*స్థాపన:2010(Act 2010)
*మొదటి ఛైర్‌పర్సన్: జస్టిస్ లోకేశ్వర్ సింగ్ పంతా N.G.T-Justice Lokeshwar Singh Panta.
*ప్రస్తుత ఛైర్‌పర్సన్: ఆదర్శ్ కుమార్ గోయల్ 

views: 764



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams