Current Affairs Telugu Daily

యుద్ధ రంగంలో సైనికులకు సహాయపడే కృత్రిమ మేథ(ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా

*భవిష్యత్‌లో యుద్ధ రంగంలో సైనికులకు సాయపడే రోబోల కోసం కృత్రిమ మేథ(ఏఐ) సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
*కదనరంగంలో సైనికుడి మెదడు ప్రతిస్పందనల ఆధారంగా ఈ సాంకేతికతకు తుదిరూపు ఇస్తున్నట్లు వెల్లడించింది.
* ఆర్మీ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ(ఏఆర్‌ఎల్‌)కి చెందిన సీనియర్‌ న్యూరో సైంటిస్ట్‌ జీన్‌ వెటెల్‌ మాట్లాడుతూ.. ఓ సైనికుడి ప్రవర్తనను అంచనా వేసే సాంకేతికతల ఆధారంగా సమర్థవంతమైన బృందాన్ని తయారుచేయొచ్చని తెలిపారు
* ఏఆర్‌ఎల్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలో శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
*పరిశోధనలో భాగంగా వేర్వేరు పనులు చేసే సమయంలో ఓ సైనికుడి మెదడు పనితీరుతో పాటు అందులోని వేర్వేరు భాగాల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేశామని జీన్‌ అన్నారు.
* ‘మిలటరీ ఆపరేషన్లు చేపట్టినప్పుడు సైనికులు చాలా పనుల్ని ఏకకాలంలో చేయాల్సి ఉంటుంది. వేర్వేరు వర్గాల నుంచి అందిన సమాచారాన్ని విశ్లేషించి, ఎదురయ్యే ముప్పుపై అప్రమత్తంగా ఉంటూ ముందుకు కదలాల్సి ఉంటుంది
* ఇలా చేయాలంటే ప్రతీ సైనికుడు వేర్వేరు అంశాలపై చాలావేగంగా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే ఒక్కో పనికి మెదడులోని ఒక్కో భాగం ఉత్తేజితం అవుతూ ఉంటుంది’ అని జీన్‌ వివరించారు.
*నాడీతంతుల మ్యాపింగ్‌ పరిశోధన కోసం తాము 30 మంది సైనికులను ఎంపిక చేసుకున్నామని జీన్‌ తెలిపారు. ‘సాధారణంగా మెదడులోని నాడీకణాలను కలుపుతూ నాడీ తంతులు ఉంటాయి.
* వీటిని వైట్‌ మ్యాటర్‌గా వ్యవహరిస్తాం. మా పరిశోధనలో భాగంగా 30 మంది జవాన్ల మెదళ్లలోని వేర్వేరు భాగాలు ఈ నాడీ తంతుల సాయంతో ఎలా అనుసంధానమయ్యాయో మ్యాపింగ్‌ చేపట్టాం.
* ఒకవేళ మెదడులోని ఏదైనా ఓ భాగాన్ని ఉత్తేజితం చేస్తే ఏమవుతుందో ప్రత్యేకంగా రూపొందించిన కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విశ్లేషించాం.
*అలాగే వేర్వేరు పనుల సందర్భంగా మెదడు సమన్వయంతో వ్యవహరించడాన్ని గుర్తించాం’ అని వెల్లడించారు.
*ఈ పరిశోధనలో సైనికుల మెదడు పనితీరును విడివిడిగానే విశ్లేషించామని పేర్కొన్నారు.
* ఒకవేళ కృత్రిమ మేథతో పనిచేసే రోబోలు, సైనికుల మధ్య సమన్వయాన్ని అధ్యయనం చేయగలిగితే నిజంగా బాగా  ఉంటుందని వ్యాఖ్యానించారు.
* మెదడు పనితీరు డేటా ఆధారంగా ఓ సైనికుడు ఏ పని చేస్తున్నాడో విశ్లేషించవచ్చనీ, తద్వారా ఏఐతో పనిచేసే రోబోల సాయంతో వారికి పనిలో సాయపడొచ్చని జీన్‌ అభిప్రాయపడ్డారు.
*United States Army Research Laboratory- Director: Dr. Philip Perconti.
*Headquarters: Adelphi, Maryland, United States


views: 823



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams