Current Affairs Telugu Daily

జెట్‌ ఎయిర్‌వేస్‌ రుణ పరిష్కారానికి ఎస్‌బీఐ నేతృత్వంలో  180 రోజుల కార్యాచరణ
*రుణదాతల చేతిలో ఉన్న ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌రుణ పరిష్కారానికి ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 180 రోజుల గడువు విధించుకున్నాయి.
*రుణ పరిష్కారానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జారీచేసిన సమయ నిర్దేశిత ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలోనూ, అవే ఆదేశాల ప్రకారం బ్యాంకులు గడువు విధించుకోవడం గమనార్హం
*జూన్‌ 30లోగా వ్యూహాత్మక వాటాదారును తీసుకురావడంలో విఫలం కావడం లేదా ప్రక్రియ పూర్తికాకపోయినా, జెట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను రుణదాతలు కోరే అవకాశం ఉన్నట్లు  ఆర్ధిక శాఖ వివరించింది.
*జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా విక్రయానికి బిడ్డింగ్‌ ప్రక్రియ నేడు ప్రారంభమవ్వనున్నట్లు తెలిపింది.
*జెట్‌ ఎయిర్‌వేస్‌కు ప్రస్తుతం రూ.8,000 కోట్ల రుణభారం ఉంది. 26 బ్యాంకులతో కూడిన రుణదాతల కన్సార్షియంకు ఎస్‌బీఐ నేతృత్వం వహిస్తోంది. 
*జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా విక్రయానికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను   జారీ చేసినట్లు  కంపెనీ అధికార వర్గం  తెలిపారు. 
*వాస్తవానికి బిడ్లను ఈనెల 6 - 9 తేదీల్లో ఆహ్వానించాలని తొలుత నిర్ణయించారు. ఆలస్యం అయినందున దాఖలు గడువును కూడా 10వ తేదీ వరకు పొడిగించే అవకాశం ఉందని వెల్లడించారు. 
*బిడ్డింగ్‌ ప్రక్రియకు సరైన స్పందన లభించకపోతే.. బ్యాంకులు వెంటనే ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించొచ్చని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి
జెట్ ఎయిర్‌వేస్ :
  • స్థాపన:  1 ఏప్రిల్ 1992
  • ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ భారతీయ విమాన సంస్థ
  • భారతదేశంలో ఇండిగో తర్వాత రెండో అతి పెద్ద విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది.
  • అంతర్జాతీయ కార్యకలాపాలను మార్చి 2004లో చెన్నై నుంచి కొలంబోకు ప్రారంభించింది.
  • నీలిరంగు, బంగారు వర్ణంతో కలయికతో జెట్ ఎయిర్ వేస్ విమానాలను పాత మోడల్ లాగానే "ఎగురుతున్న సూర్యుడు "లోగో ముద్రించారు.
  • లండన్ లోని బిజినెస్ ట్రావెల్ వారి ఉత్తమ భారతీయ ఎయిర్ లైన్ అవార్డులతో పాటు ఎన్నో దేశీయ, అంతర్జాతీయ అవార్డులు పొందినది

views: 717

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams