Current Affairs Telugu Daily

హైజాకింగ్‌కు కఠిన శిక్షలు : కేంద్రం
హైజాకింగ్‌ నిరోధకానికి సంబంధించిన కొత్త చట్టాన్ని కేంద్రం నోటిఫై చేసింది. దీంతో 1982 నాటి యాంటీ-హైజాకింగ్‌ చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చినట్టయ్యింది. దీని ప్రకారం.. విమాన సిబ్బంది, ప్రయాణికులు, భద్రతా సిబ్బంది వంటి బందీలెవరైనా మరణిస్తే హైజాకింగ్‌కు పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారు. విమానంలోని భద్రతా సిబ్బంది లేదా రన్‌వేపై సహకరించే సిబ్బంది మరణాలనూ కొత్త చట్టంలో చేర్చటానికి నిర్వచనాన్ని కూడా విస్తరించారు. బందీలు మరణించని సందర్భాల్లో హైజాకింగ్‌నకు పాల్పడ్డవారికి జీవితఖైదు, జరిమానా విధిస్తారు. వారి స్థిర, చరాస్తులను కూడా స్వాధీనం చేసుకుంటారు. హైజాకింగ్‌నకు పురిగొల్పే వారిని లేదా సంస్థలను కూడా నేరానికి పాల్పడినట్టుగానే గుర్తిస్తారు. 1982 నాటి చట్టాన్ని తొలగించటానికి పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు 2014 డిసెంబరు 17న రాజ్యసభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. కొద్దిరోజులు  తర్వాత దీన్ని పార్లమెంటరీ సంఘానికి పంపారు. ఇది 2015 మార్చిలో నివేదిక సమర్పించింది. ఈ బిల్లును రాజ్యసభ 2016, మే 4న, మే 9న లోక్‌సభ ఆమోదించింది.
views: 944

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams