Current Affairs Telugu Daily

జమ్మూశ్రీనగర్‌ జాతీయరహదారిపై పౌరుల వాహనాలకు ఆంక్షలు
* భద్రతాదళాల వాహనశ్రేణికి ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు కలగకుండా చూడటానికి  జమ్మూకశ్మీరు గవర్నరు సత్యపాల్‌మాలిక్‌ తీసుకున్న కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది.
*  జమ్ము-శ్రీనగర్‌-బారాముల్లా జాతీయ రహదారిపై వారానికి రెండుసార్లు పౌరుల వాహనాల రాకపోకలను అనుమతించరు.
* దీనిపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), పీపుల్స్‌ డెమాక్రాటిక్‌ పార్టీ(పీడీపీ), రాష్ట్ర కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేశాయి.  *జమ్మూకశ్మీరుకు చెందిన 400 మందికిపైగా రాజకీయనాయకులకు  గవర్నరు సత్యపాల్‌ మాలిక్‌ ఆదేశాలతో భద్రతను పునరుద్ధరించారు.
జమ్మూ-కాశ్మీరు:
  • భారత రాజ్యాంగంలోని 370వ ప్రకరణం ప్రకారం జమ్ము-కాశ్మీరు రాష్ట్రానికి "ప్రత్యేక ప్రతిపత్తి" ఉంది.
  • కాశ్మీరును "భూతల స్వర్గం" గా వర్ణిస్తారు.
  • 1962లో జరిగి భారత-చైనా యుద్ధంలో కాశ్మీరు ఈశాన్యభాగమైన ఆక్సాయ్ చిన్ భాగాన్ని చైనా ఆక్రమించింది
  • ఆరు నెలల గవర్నర్ పాలన ముగియడంతో ప్రస్తుత గవర్నర్ సత్యపాల్ మాలిక్ రాష్ట్రపతికి నివేదిక పంపారు. మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
  • రాష్ట్రంలో 1977 నుంచి గవర్నర్‌ పాలన ఇది ఎనిమిదోసారి 
  • గవర్నర్ : సత్యపాల్ మాలిక్
  • రాజదాని: జమ్మూ/శ్రీనగర్

views: 739

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams