Current Affairs Telugu Daily

 విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించాలనుకునే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ (ఎంసీఐ) తాజా నిర్ణయం
* విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించాలనుకునే అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) తాజాగా నిర్ణయం తీసుకొంది.
*నీట్‌లో ఒక్కసారి ఉత్తీర్ణత సాధిస్తే మూడేళ్ల వరకూ అదే ఉత్తీర్ణత ధ్రువపత్రంతో విదేశాల్లో వైద్యవిద్యకు అర్హులవుతారు.
* ఈ మేరకు ఇటీవల నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
* వైద్యవిద్య ప్రవేశాల్లో నీట్‌ ప్రవేశపెట్టిన అనంతరం ఈ అర్హత పరీక్షను విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించాలనుకునే అభ్యర్థులకు కూడా వర్తింపజేస్తూ 2018లోనే ఎంసీఐ నిర్ణయం తీసుకొంది.
*అదే తొలి సంవత్సరం కావడంతో దీనిపై కొందరు విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2018లో విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించాలనుకునే అభ్యర్థులకు నీట్‌ తప్పనిసరి నిబంధనను తొలగించింది.
* 2019 నుంచి మాత్రం కచ్చితంగా మన దేశంలో నీట్‌లో అర్హత సాధిస్తేనే విదేశాల్లో వైద్యవిద్యకు అర్హులుగా పరిగణిస్తూ ఆదేశాలు జారీచేసింది.
* తాజా నిర్ణయం ప్రకారం నీట్‌కు అర్హత సాధించిన సంవత్సరం నుంచి మూడేళ్ల వరకూ విదేశాల్లో ఎప్పుడైనా వైద్యవిద్యను అభ్యసించడానికి వెళ్లవచ్చు.
*2018 నీట్‌లో అర్హత సాధించకుండా.. ఇప్పటికీ విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించాలనుకునే అభ్యర్థులు జూన్‌ 5 2019లోగా ఎంసీఐ నుంచి అర్హత పత్రాలను పొంది, విదేశాల్లో వైద్యవిద్య ప్రవేశాలను పూర్తి చేసుకోవాలని సూచించింది. .

views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams