Current Affairs Telugu Daily

పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాలపై అమెరికా (ఫారిన్‌ పాలసీ)కథనానికి స్పందించిన రక్షణశాఖ

*పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాలపై అమెరికాకు చెందిన ‘ఫారిన్‌ పాలసీ’ కథనంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు
* పాక్‌లో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను లెక్కించామని.. అన్నీ సరిగ్గానే ఉన్నాయన్న ఆ పత్రిక పేర్కొనడాన్ని తప్పుబట్టారు.
* భారత భూభాగంలో దొరికిన ‘ఆమ్రామ్‌’ క్షిపణి శకలాలను చూపించారు. దీన్ని కేవలం ఎప్‌-16 యుద్ధ విమానం ద్వారానే ప్రయోగించే వీలుంది.
* ఒకవేళ పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వాడకపోతే ఈ శకలం భారత భూభాగంలో ఎలా దొరికింది?
* ’ అని సీతారామన్‌ పేర్కొన్నారు.
*పాకిస్థాన్‌ ఆయుధగారంలో ఎఫ్‌-16 విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయన్న ఫారిన్‌ పాలసీ పత్రిక కథనంపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ స్పందించిన విషయం తెలిసిందే.
* ఆ పత్రిక పేర్కొన్నట్లు పాక్‌లో ఆ శ్రేణి యుద్ధ విమానాలపై తనిఖీ జరిగిందన్న అంశంపై తమకు ఎటువంటి సమాచారమూ లేదని పెంటగాన్‌ పేర్కొంది.
*ఫిబ్రవరి 27న భారత్‌-పాక్‌ల మధ్య జరిగిన వైమానిక పోరులో పాక్‌కు చెందిన ఓ ఎఫ్‌-16ను కూల్చినట్లు భారత్‌ తెలిపింది.
*దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను కూడా అమెరికాకు సమర్పించింది.

  • ఎఫ్-16 ప్రత్యేకతలు :

*ఎఫ్‌16 అధికారిక నామం ఫైటింగ్‌ ఫాల్కన్‌. కానీ, పైలట్లు దీన్ని ‘వైపర్‌’గా వ్యవహరిస్తారు. దీని ముందు భాగం అచ్చం వైపర్‌ రకం పామును తలపించేలా ఉండటమే ఇందుకు కారణం. 
*ఫ్రేములేని బబుల్‌ కెనోపీ ఉన్న మొదటి ఫైటర్‌ జెట్‌ విమానం ఇదే. దీనివల్ల లోపల కూర్చున్న పైలట్‌కు.. అద్దం పక్క భాగాల నుంచి 40 డిగ్రీల మేర కిందకి చూడగలిగే అవకాశం ఉంటుంది. 
*ఎఫ్‌16 విమానాల సర్వీసింగ్‌ చాలా సులభం. ఎందుకంటే.. వీటిలోని యాక్సిస్‌ ప్యానెళ్లలో 80 శాతం ఎలాంటి నిచ్చెనా ఎక్కాల్సిన అవసరం లేకుండానే సర్వీసింగ్‌ చేయడానికి అనుగుణంగా విమానం కింది భాగంలో ఉంటాయి. 

  • అంకెల్లో.. 

*ఎఫ్‌16 రెక్కల విస్తృతి: 32.8 అడుగులు. 
*విమానం పొడుగు: 49.5 అడుగులు. 
*ఎత్తు: 16 అడుగులు. 
*బరువు: 8936 కిలోలు (ఇంధనం లేకుండా), 
*గరిష్ఠ టేకాఫ్‌ బరువు: 16,875 కిలోలు. 
*ఇంధన సామర్థ్యం: 3175 కిలోలు. 
*వేగం: గంటకు 1500 మైళ్లు (మాక్‌ 2 వేగం) 
*ఆర్మమెంట్‌: 500 రౌండ్లతో కూడిన ఒక ఎం61ఏ 120 ఎంఎం మల్టీబారెల్‌ క్యానన్‌, గగనతలం నుంచి ప్రయోగించగల 11 క్షిపణులు, సంప్రదాయ యుద్ధసామగ్రి


views: 697

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams