Current Affairs Telugu Daily

ఏశాట్‌ పరీక్ష ద్వారా వచ్చే శకలాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎటువంటి నష్టం కలుగదు: DRDO
ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌) పరీక్షను విజయవంతంగా నిర్వహించడంతో  అంతరిక్షంలో వెయ్యి కిలోమీటర్లకుపైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం భారత్‌కు సమకూరిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ వివరించింది.
*కక్ష్యలోని విదేశీ ఆస్తులకు ఎలాంటి ముప్పు కలగకుండా చూసేందుకు దాదాపు 300 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉన్న ఉపగ్రహాన్ని లక్ష్యంగా ఎంచుకున్నామని ఆ సంస్థ చైర్మన్ జి.సతీశ్‌ రెడ్డి వివరించారు.
*గత నెల 27న భారత్‌ ‘మిషన్‌ శక్తి’ పేరుతో ఒక పాత ఉపగ్రహాన్ని ఏశాట్‌ క్షిపణితో విజయవంతంగా ఢీ కొట్టింది. *ఏశాట్‌ పరీక్ష ద్వారా వచ్చే శకలాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి ముప్పు ఉందంటూ అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఆందోళన వ్యక్తం చేయడంపై స్పందిస్తూ..ఈ శకలాలు ఐఎస్‌ఎస్‌ను ఢీ కొట్టే అవకాశాలు లేవని స్పష్టంగా చెప్పగలమని రోజుల్లో శకలాలన్నీ విచ్ఛిన్నమవుతాయని తెలిపారు. 
భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ :
  • స్థాపన: 1958
  • ప్రత్యేక విభాగంగా 1980 లో ఏర్పాటు
  • చైర్మన్- డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి( నెల్లూరు)
  • ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ పరిశోధన మరియు అభివృధ్థి విభాగము పరిధి లోనిది.
  • జాతీయ భద్రతకు సంబంధించిన వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మాణవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్ధశాస్త్రం, మిసైల్‌లు, యుద్ధశకటాలు, యుద్ధనౌకలు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటాయిభారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ :
  • స్థాపన: 1958
  • ప్రత్యేక విభాగంగా 1980 లో ఏర్పాటు
  • చైర్మన్- డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి( నెల్లూరు)
  • ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ లోని రక్షణ పరిశోధన మరియు అభివృధ్థి విభాగము పరిధి లోనిది.
  • జాతీయ భద్రతకు సంబంధించిన వైమానిక అవసరాలు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, మాణవ వనరుల అభివృద్ధి, జీవశాస్త్రం, పదార్ధశాస్త్రం, మిసైల్‌లు, యుద్ధశకటాలు, యుద్ధనౌకలు వంటి విషయాలపై ఈ పరిశోధనాలయాలలో పరిశోధనలు జరుగుతుంటాయి

views: 769

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams