Current Affairs Telugu Daily

ఏపీ చీఫ్ సెక్రటరీ గా ఎల్వి సుబ్రమణ్యం
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ది చేసేలా వ్యవహరిస్తున్నారని  పలు పక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన  నేపథ్యంలోనే సీఎస్ పునేఠపై బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధులకు అనిల్‌చంద్ర పునేఠను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించింది. 
ఈ సందర్భంగా అనిల్‌చంద్ర స్థానంలో ఏపీకి కొత్త సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంను అపాయింట్ చేసింది.
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ గా కొనసాగనున్నారు. అనిల్‌చంద్ర పునేఠకు ఎన్నికల విధులతో సంబంధం లేని బాధ్యతలను ఈసీ అప్పగించింది. 
ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983 బ్యాచ్ కు చెందిన ఐఏస్ ఆఫీసర్. ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ యూత్ సర్వీసెస్ పోస్టులో ఉన్నారు.

views: 865

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams