Current Affairs Telugu Daily

2019-20 కి భారత వృత్తి రేటు  6.8%: ఫిచ్‌ అంచనాలు
*భారత్‌ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 6.8%, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.1% నమోదు అవ్వనున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ అంచనా వేసింది. 
*భారత ఆర్థిక వ్యవస్థ కు సంబంధించి పలు రకాల అంశాలను నివేదికలో  వెల్లడించింది.
ఫిచ్‌ తమ నివేదికలో పలు అంశాల్ని ప్రస్తావించిందిః
  • దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. తయారీ రంగంలో బలహీనతలు రైతుల ఆదాయం తగ్గడంతో జీడీపీ వృద్ధి పై ప్రభావం
  • తక్కువగా ఉద్యోగాల సృష్టితోపాటు గ్రామీణ ఆదాయం పెంచడంలో విఫలం
  • భారత్‌లో పాలనా ప్రమాణాలు, మానవ అభివృద్ధి బలహీనంగా ఉన్నాయి
  • రైతులకు హామీ ఇచ్చినట్లుగా కనీస ఆదాయ మద్దతు పథకం అమలు చేయడానికి వ్యయాలు పెంచాల్సి రావొచ్చు. దీంతో 2019-20లో ద్రవ్యలోటు పెరిగే అవకాశం ఉంది.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సరాసరిన 3.8 శాతం నమోదయ్యే అవకాశం ఉంది.
  • 2019-20లో  కరెంటు ఖాతా లోటు (సీఏడీ) 2.3 శాతంగా నమోదు కావొచ్చు.
  • సెంటర్‌ ఫర్‌ మోనిటరింగ్‌ ది ఇండియన్‌ ఎకానమీ నివేదిక ప్రకారం 2018లో సుమారు 1.1 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు ఈ విషయం ప్రభుత్వాలు వెల్లడించడం లేదు

views: 733Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams