Current Affairs Telugu Daily

ఏపీ ఏసీబీ డీజీగా శంకబ్రత బాగ్చి
ఆంధ్రప్రదేశ్‌ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్‌ (డీజీ)గా శంకబ్రత బాగ్చిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.
*ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శంకబ్రత  ఆ విభాగంలో సీనియర్ అధికారిగా ఉన్నారు. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పునేఠా ఉత్తర్వులు ఇచ్చారు.
*ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను తక్షణం ఆ విధుల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో డీజీపీ భేటీ అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.
  • Anti-Corruption Bureau(Andhra Pradesh) Headquarters: Hyderabad
  • Founded: 2 January 1961

views: 837

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams