Current Affairs Telugu Daily

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఉద్దీపన ప్రణాళిక ప్రధాని కార్యాలయం అంగీకారం

*నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు ఉద్దీపన పథకాలు ప్రకటించేందుకు ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సూత్రప్రాయంగా అంగీకరించింది.
*ఈ సంస్థలు ఎదుర్కొంటున్న 3 సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించారు
*రెండు టెలికాం సంస్థలకు 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు, ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ, సత్వరం ఆర్థికసాయం వంటి అంశాలపై మార్గసూచీ రూపొందించాలని టెలికాం విభాగాన్ని కోరింది

* బీఎస్‌ఎన్‌ఎల్‌: టెలికాం సంస్థల్లో అతి తక్కువగా రూ.14,000 కోట్ల రుణం మాత్రమే ఉన్న సంస్థ. రూ.7,000 కోట్లను ప్రభుత్వం ఈక్విటీ వాటాగా చెల్లించడం ద్వారా, దేశవ్యాప్తంగా 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని కోరుతోంది. మొత్తం స్పెక్ట్రమ్‌ విలువ రూ.14,000 కోట్లు అవుతుంది.
* ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటంతో, రెండు సంస్థలకూ వ్యయాలు భారీగా ఉంటున్నాయి. ఈ సంస్థల ఏర్పాటు సమయంలో, టెలికాం శాఖ నుంచి వీరు ఈ రెండు సంస్థలకు బదిలీపై వచ్చారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు 1.76 లక్షలు, ఎంటీఎన్‌ఎల్‌కు 22,000 మంది ఉద్యోగులున్నారు.
* బ్రాడ్‌బ్యాడ్‌ వైర్‌లెస్‌ స్పెక్ట్రమ్‌ కోసం 2010 వేలం ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ధర చెల్లించింది. దీనికింద జమచేసిన వడ్డీని తిరిగివ్వాలని సంస్థ కోరుతోంది.
* తమ భూములు, ఇతర స్థిరాస్తుల నగదీకరణకు అనుమతివ్వాలని ఇరు సంస్థలు కోరుతున్నాయి. గుజరాత్‌ తరహాలో ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతివ్వాలనీ విజ్ఞప్తి చేస్తున్నాయి.
* BSNL:headquartered - New Delhi.
* It was incorporated on 15 September 2000.
*CEO: Shri Anupam Shrivastava.
*Mahanagar Telephone Nigam Limited (MTNL): Mumbai and New Delhi.
*(MTNL) CEO: Pravin Kumar Purwar.
*(MTNL) Found 1st april 1986.


views: 714



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams