Current Affairs Telugu Daily

భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు (సహ) చట్టం పరిధిలోకి వస్తుందా? అనే  అంశంపై సుప్రీం ధర్మాసనం

*భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు (సహ) చట్టం పరిధిలోకి వస్తుందంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్‌ వేసింది.
 దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్త, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనంఈ వ్యాఖ్యలు చేసింది.
* పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థను,ఒక సంస్థను నాశనం చేయజాలరని సుప్రీంకోర్టు  పేర్కొంది.
*సహ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి న్యాయ వ్యవస్థ విముఖత చూపడం దురదృష్టకరమని పలువురు వాదిస్తున్నారు.
* రాజ్యంలోని వివిధ వ్యవస్థల పని తీరులో పారదర్శకతను సుప్రీంకోర్టు ఎప్పుడూ కోరుకుంటోందని, స్వీయ అంశాలపై మాత్రం భిన్న వైఖరిని అనుసరిస్తోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే.. జవాబుదారీతనం లేని పరిస్థితి కాదని, కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి స్వతంత్రత అని అర్థమన్నారు.
సమాచార హక్కు (సహ) చట్టం:

  • భారత ప్రభుత్వం 2005 లో సమాచారహక్కుచట్టాన్ని రూపోందించినిది. 
  • ప్రభుత్వయంత్రాగం స్వచ్చందంగా ప్రజలకు సమాచారం అందించాలన్నదే సహచట్టం ప్రధానోద్ధేశo
  • దరకాస్తుదారు ఏఅఫిస్నుంచైనా తనకవసరమైన సమాచారాన్ని 30 రోజులలోపు పొందవచ్చు
  • గడువులోగా సమాచారం రానియెడల ప్రజాసమాచార (P.I.O) అధికారికి రు.10/- రుసుం చెల్లించి ధరకాస్తు చేసి 30 రోజులలోపు సమాచారం పొందవచ్చు

views: 699

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams