Current Affairs Telugu Daily

మాతృ భాషల పరిరక్షణకు జాతీయోద్యమం కృషిచేయాలని వెంకయ్యనాయుడి పిలుపు
 *ప్రాచీన భారతీయ భాష,  మాతృ భాషల పరిరక్షణకు విశేష కృషి తో జాతీయోద్యమం రావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
* ఈ విభాగంలో విశేష కృషిచేసిన సుమారు వంద మందికి  ‘రాష్ట్రపతి గౌరవ ప్రశంసాపత్రాలు’, ‘మహర్షి బద్రాయన్‌ వ్యాస్‌ సమ్మాన్‌’ అవార్డులను ఆయన  ప్రదానం చేశారు.
*సంస్కృతం, అరబిక్‌, పర్షియన్‌, పాలి, ప్రాకృత్‌, ప్రాచీన కన్నడ, తెలుగు, మలయాళ భాషలకు విశేష సేవలందించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. 
* శలాక రఘునాథ శర్మ(ప్రాచీన తెలుగుభాష),
* నెగ్రెస్‌ డానియల్‌ (ప్రాచీన తెలుగు-అంతర్జాతీయం)
*, విశ్వనాథగోపాలకృష్ణ, ఎస్‌. లక్ష్మి ప్రసన్నాంజనేయశర్మ,  కేవీ రామకృష్ణమాచార్యులు, ఎస్‌. లక్ష్మినరసింహం, ఎస్‌.రామమూర్తి శాస్త్రి, బి.నరసింహాచార్యులు(సంస్కృతం),
* బేతవోలు రామబ్రహ్మం (ప్రాచీన తెలుగు),
* సముద్రాల వెంకట రంగ రామానుజాచార్యులు, వంగీపురం నవనీతం వేదాంత దేశికన్‌ (ప్రాచీన సంస్కృతం)
*ఉపరాష్ట్రపతి చేతులమీదుగా రాష్ట్రపతి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
* హెచ్‌ లక్ష్మణ చక్రవర్తి(తెలుగు), గాయత్రి మురళీకృష్ణ రావూరి (సంస్కృతం)లు ‘మహర్షి బద్రాయన్‌ వ్యాస్‌ సమ్మాన్‌’లను స్వీకరించారు.
*‘భాష చనిపోతే సంస్కృతీ చనిపోతుంది. వివిధ రకాల అధ్యయనాలు, నిపుణుల అంచనా ప్రకారం దాదాపు 600 భాషలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. 
*గత అరవై ఏళ్లలో దాదాపు 250 భాషలు అంతరించిపోయాయి.
  • ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
  • బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజును జరుపుకుంటారు
  • ఐక్య రాజ్య సమితి జెనరల్ అసెంబ్లీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించి, 2008ని అంతర్జాతీయ భాష సంవత్సరంగా ప్రకటించింది.

views: 689

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams