Current Affairs Telugu Daily

పర్యావరణం మెరుగుకు రూ.100 కోట్లు డిపాజిట్‌ చేయాలి  ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ ఆదేశం
* ఇసుక అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద తాత్కాలిక చర్య కింద రూ.వంద కోట్లు డిపాజిట్‌ చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది.
* కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ అటవీశాఖ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మైన్స్‌కు చెందిన సభ్యులతో కూడిన బృందం ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించింది.
*ఎన్జీటీ ఆదేశం మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బెంగుళూరు ప్రాంతీయ కార్యాలయం అధికారులు,  మరియు  ఇతర  అధికారులు, సంయుక్తంగా రాజధాని ప్రాంతంలోని పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి, సూరాయపాలెం, గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలపై అధ్యయనం చేసి  నివేదిక సమర్పించారు.
*  ఈ నివేదికపై విచారించిన ఎన్జీటీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం పర్యావరణానికి తీవ్ర నష్టం కల్గిస్తున్నట్లు అభిప్రాయపడింది.
* ఇకమీదట రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులిచ్చింది.
* ఇసుక అక్రమ తవ్వకం వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనావేసి ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని స్పష్టం చేసింది.
* పర్యావరణ నష్టాన్ని సరిదిద్దేందుకు వీలుగా తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద రూ.వంద కోట్లు డిపాజిట్‌ చేయాలని నిర్దేశించింది. 

జాతీయ హరిత ట్రైబ్యునల్‌:
  • పర్యావరణాన్ని పరిరక్షించడం, అటవీ సంరక్షణ, పర్యావరణానికి సంబంధించి న్యాయపరమైన హక్కులను పరిరక్షించడం, పర్యావరణానికి హాని కలిగినందువల్ల నష్టపోయిన వారికి పరిహారం అందేట్టు చూడడం ఈ సంస్థ బాధ్యత. 
  • పర్యావరణానికి సంబంధించిన వ్యాజ్యాలను త్వరగా తెమల్చడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 
  • సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అర్హత ఉన్న వారిని ఎవరినైనా ట్రిబ్యునల్ చైర్మన్ గా నియమించవచ్చు
  • ఈ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన బెంచ్ (న్యాయ స్థానం) భోపాల్ లో యేర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక న్యాయ స్ధానంతో సంధానం చేయబడి 4 సర్క్యూట్ న్యాయ స్థానాలు ఉంటాయి.
  • ఈ కోర్టు జల, వాయు, కాలుష్యాలపై గల పర్యావరణ రక్షణ, అడవుల సంరక్షణ మరియు జీవ వైవిధ్య చట్టాలు వంటి అన్ని పర్యావరణ చట్టాలననుసరించి తీర్పును ఇస్తుంది.
  • ఈ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను తిరగదోడే అవకాశం కేవలం సుప్రీం కోర్టుకు మాత్రమే ఉంటుంది.
*స్థాపన: 18 అక్టోబర్ 2010.(Act 2010)
*ప్రస్తుత చైర్మన్-  జస్టీస్ ఆదర్శ్ కుమార్ గోయల్ 
*మొదటి చైర్మన్ - జస్టీస్ లోకేశ్వర్ సింగ్  
*సభ్యులు: న్యాయ నిపుణులు(కనీసం 10 , గరిష్టంగా 20)

views: 846

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams