Current Affairs Telugu Daily

జైషే ఉగ్రవాది నిసార్‌ తాంత్రేను భారత్‌కు అప్పగించిన యూఏఈ 
*యూఏఈలో తలదాచుకుంటున్న జమ్మూకశ్మీర్‌లోని లేథ్‌పొరా దాడి సూత్రధారి, జైషే మహమ్మద్‌ ఉగ్రవాది నిసార్‌ తాంత్రేను అక్కడి ప్రభుత్వం భారత్‌కు అప్పగించింది.
*2017 డిసెంబరు 30వ తేదీ రాత్రి సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరిలో ఫయాజ్‌ అహ్మద్‌ అనే నిందితుడి అరెస్టు చేశారు.  
* నిసార్‌ వర్క్‌వీసాపై యూఏఈకి వెళ్లాడు. భారత్‌ కోరిక మేరకు నిసార్‌ను యూఏఈ డీపోర్ట్‌ చేయగా.. అతడు భారత్‌ చేరగానే ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.
*Masood Azhar- founder of Jaish e Mohammed
*UAE: United Arab Emirates
*Capital: Abu Dhabi

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams