Current Affairs Telugu Daily

 పారా మిలటరీ దళాల్లో పనిచేస్తున్న జవాన్లకు ఆదాయ పన్ను మినహాయింపు 
*పారా మిలటరీ దళాల్లో పనిచేస్తున్న జవాన్లకు   వారికి ప్రస్తుతం ఇస్తున్న నిత్యావసర సరకుల భత్యం, ప్రతికూల పరిస్థితుల భత్యానికి ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభించనుంది.
*పే కమిషన్‌ సిఫార్సులను పరిగణనలోకి తీసుకుంటూ సాయుధ దళాలకు ఇచ్చినట్లుగానే పారా మిలటరీ దళాలకు కూడా ఆయా భత్యాలపై ఆదాయపన్నును మినహాయించాలని గతంలో హోంశాఖ ప్రతిపాదించింది, ఆర్థిక శాఖ ఇటీవల ఆమోదించింది.
*ఆయా దళాలకు నెలకు నిత్యావసర సరకుల భత్యం కింద రూ.3వేలు, ప్రతికూల పరిస్థితుల భత్యం కింద వివిధ అంశాల ప్రాతిపదికన 6 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకూ చెల్లిస్తున్నారు.
* ఇది ఆచరణ రూపం దాలిస్తే సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీల్లో పనిచేస్తున్న దాదాపు 9 లక్షల మంది జవాన్లకు లబ్ది కలగనుంది.

views: 680

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams