Current Affairs Telugu Daily

ప్రపంచ ఆటిజమ్ అవగాహనా దినోత్సవం: ఏప్రిల్ 2

ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవాన్ని ఏప్రిల్ 2, 2019న ప్రపంచవ్యాప్తంగా పాటించారు. ఇది 12వ ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవం. ఆటిజమ్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ దినాన్ని పాటిస్తారు.
ఈ రోజున ఆటిజమ్ స్పీక్స్ అనే సంస్థ లైట్ ఇట్ అప్ బ్లూ (Light It Up Blue) అనే ప్రపంచవ్యాప్త అవగాహన కార్యక్రమంను ప్రారంభించింది.  లైట్ ఇట్ అప్ బ్లూ అనేది, ఆటిజమ్ అవగాహన నెల కోసం రూపొందించిన ఒక ప్రపంచవ్యాప్త కార్యక్రమం. 
  

  • ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవం

ఆటిజమ్ పై డిసెంబర్ 18, 2007న ఆమోదించిన ఒక తీర్మానం ద్వారా, ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 2న నిర్వహించడం ప్రారంభించింది. ఈ వ్యాధితో బాధపడే పెద్దలు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లల జీవితాలను మెరుగు పరచి, వారికి తోడ్పాటును అందించడం కోసం ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

  • ఆటిజమ్

ఆటిజమ్ అనేది ఒక మానసిక వైకల్య స్థితి, సాధారణంగా ఈ లక్షణాలు పిల్లలలో మొదటి మూడేళ్ళలో అభివృద్ధి చెందుతుంది. ఈ వ్యాధికి మందులు లేవు. మెదడు పనితీరుకు సంబంధించిన (న్యూరోలోజికల్ డిసార్డర్) లోపం వల్ల ఇది సంభవిస్తుంది. తోటివారితో కలవకపోవటం, సరిగ్గా మాట్లాడలేకపోవటం, భావప్రకటనలో లోపాలు మరియు ఆసక్తులు, ప్రవర్తనలో (పరిమితి) నియంత్రణ వంటివి ఈ వ్యాధి లక్షణాలు.

*తొలి ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవాన్ని ఏప్రిల్ 2, 2008న జరిపారు.
*Theme : ‘Assistive Technologies. Active Participation’

views: 839

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams