Event-Date: | 03-Apr-2019 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |
* ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం చేసిన చట్టం తెలంగాణలోనూ అమలుకానుంది.
* ఆయా వర్గాలకు ‘ఇన్కం-అసెట్స్ సర్టిఫికెట్’ పేరుతో ఆదాయం-స్థిరాస్తుల ధ్రువపత్రం ఇచ్చేందుకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పత్రాలు జారీచేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించింది.
* ఆయావర్గాలను గుర్తించేందుకు వీలుగా పలు మార్గదర్శకాలను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జారీచేశారు.
.*కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, సివిల్ పోస్టులు, సేవలకు సంబంధించిన రంగాల్లో ప్రాధాన్యతా క్రమంలో 10శాతం రిజర్వేషన్ పొందేందుకు ఈ ధ్రువపత్రాలు ఉపయోగపడనున్నాయి.
* దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి ఏడు రోజుల్లో ధ్రువపత్రం జారీ చేసేలా నిబంధనల్లో పేర్కొన్నారు.
* ఒక విద్యాసంవత్సరం లేదా పత్రం జారీ అయిన నాటి నుంచి ఏడాదిపాటు ఈ ధ్రువపత్రం చెల్లుబాటు కానుంది. *దరఖాస్తుదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలకు దాటకుండా ఉండాలని,
* ఇది వేతనం, వ్యవసాయం, వ్యాపారం, వృత్తితోపాటు ఏ ఇతర మార్గం నుంచైనా ఆ లోపు ఉండాలని పరిమితి విధించారు
* షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు, కేంద్ర ప్రభుత్వ జాబితాలోని ఓబీసీ వర్గాలకు చెందని వారు.
* కుటుంబానికి ఐదు ఎకరాలలోపు వ్యవసాయ భూమి.
* నోటిఫైడ్ మున్సిపాలిటీలో వెయ్యి చదరపు అడుగుల లోపు స్థలం, 100 చదరపు గజాలలోపు స్థలంలో నివాసం.
* మున్సిపాలిటీలు కాని ప్రాంతాల్లో 200 చదరపు గజాలలోపు నివాసం స్థలం.