Current Affairs Telugu Daily

నకిలీ వార్తల కట్టడికి వాట్సాప్‌ ‘చెక్‌పాయింట్‌ టిప్‌లైన్‌’  ఆవిష్కరణ 
*ఎన్నికల వేళ నకిలీ వార్తలపై చర్యలకు సామాజిక మాద్యమం ‘వాట్సాప్‌’  వినియోగదారులు తాము అందుకునే సమాచారంలో ప్రామాణికతను తనిఖీ చేసుకునేందుకు వీలు కల్పించే ‘చెక్‌పాయింట్‌ టిప్‌లైన్‌’ను ఆవిష్కరించింది.
* భారత్‌కు చెందిన అంకుర పరిశ్రమ ‘ప్రొటో’ అభివృద్ధి చేసింది  . వదంతులతో కూడిన ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేయడంలో ఇది తోడ్పాటు అందిస్తుంది.
* భారత్‌లోని వాట్సాప్‌ వినియోగదారులు తమకు అందే దుష్ప్రచారం లేదా వదంతులను చెక్‌పాయింట్‌ టిప్‌లైన్‌కు వాట్సాప్‌ (+91-9643-000-888) ద్వారా పంపాలి. ఆ వెంటనే ప్రొటో సంస్థలోని తనిఖీ కేంద్రం స్పందిస్తుంది.
* సదరు సమాచారాన్ని నిజమైందా,అసత్యమా,తప్పుదోవ పట్టించేదా, వివాదాస్పదమైందా అని కూడా వర్గీకరిస్తుంది. దానికి సంబంధించిన ఇతర సమాచారమేదైనా ఉందా అన్నది తెలియజేస్తుంది.
*ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళం భాషల్లో సేవలు అందిస్తుంది.
*WhatsApp;Founded: 2009
*Headquarters: Menlo Park, California, United States
*Acquisition date: 19 February 2014
*Founders: Jan Koum, Brian Acton
*WhatsApp CEO,  Jan Koum 

views: 817



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams