Current Affairs Telugu Daily

పదవీవిరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమం 

*ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీవిరమణ సమయంలో అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు వీలుకల్పించింది. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించినది .
* ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి  జస్టిస్‌ దీపక్‌గుప్తా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
* దీంతో ఇకనుంచి ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి తీసుకునే చివరి సగటు వాస్తవిక మూలవేతనం, డీఏపై ఈపీఎఫ్‌ పింఛను లెక్కించేందుకు మార్గం సుగమమయింది
*. అధిక పింఛను కోసం ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఆప్షన్‌ ఇవ్వాలని సూచించింది. దీనికి గడువేమీ లేదని తేల్చిచెప్పింది. ఈ తీర్పుతో ఈపీఎఫ్‌ పరిధిలో వేతన జీవులకు వారు పొందుతున్న వేతనాల మేరకు పింఛను లభించనుంది.
*ఈపీఎస్‌పై గరిష్ఠ పరిమితి ఉండటంతో అధిక వేతనాలున్నప్పటికీ పరిమితికి మించి చెల్లించేందుకు వీలు లేదు. తాజాగా సుప్రీం నిర్ణయంతో ఇప్పటివరకు సర్వీసుకు సంబంధించి అదనపు ఈపీఎస్‌ మొత్తాన్ని ఉద్యోగి చెల్లించాల్సి ఉంటుంది.

  • EPFO: Employees' Provident Fund Organisation
  • Founded: 4 March 1952, New Delhi
  • Headquarters: New Delhi
  • EPFO is a statutory body of Union Government that comes under the aegis of Ministry of Labour and Employment.
  • The main functions of the EPFO: Administers a compulsory contributory Provident Fund Scheme (1952), Pension Scheme (1995) and Insurance Scheme (1976).

views: 743



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams