Current Affairs Telugu Daily

‘రఫేల్‌’పై పుస్తకావిష్కరణ పై అభ్యంతరాలు తెలిపిన ఎన్నికల సంఘం 
రఫేల్‌ యుద్ధ విమానాలకు సంబంధించిన ఒప్పందంపై రూపొందిన నాట్టై ఉలుక్కుమ్‌ రఫేల్‌ బేర ఊళల్‌ (దేశాన్ని వణికిస్తున్న రఫేల్‌ కుంభకోణం) పుస్తకం విడుదల కార్యక్రమం పై ఎన్నికల సంఘం అభ్యంతరం
* రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై వివిధ వేదికల ద్వారా అనేక వ్యాసాలు వెలువడ్డాయి. వాటి ఆధారంగా విజయన్‌ అనే రచయిత రాసిన పుస్తకాన్ని భారతి పబ్లికేషన్‌ సంస్థ ప్రచురించింది.
*36 రఫెల్‌ యుద్దవిమానాల కోసం రూ. 58 వేల కోట్లతో ఫ్రాన్స్‌తో ఒప్పందం
  • ఎక్కడః భారతి పబ్లికేషన్‌ సంస్థ కార్యాలయంలో
  • ముఖ్య అతిథిః ఎన్‌.రామ్‌ 
**‌రఫెల్‌ ఒప్పందం – కీలక ఘట్టాలుః
ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్‌ కంపెనీ నుంచి భారత్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో మొదటి నుంచి ఇప్పటి వరకు పరిణామాలు ఇలా ఉన్నాయి.
*2007, ఆగస్టు 28 : 126 అత్యాధునిక యుద్ధ విమానాలను కొనాలని భారత రక్షణ శాఖ నిర్ణయం.
*2008, సెప్టెంబర్‌ 4 : విమానాల తయారీ కోసం రిలయన్స్‌ వారి ఎయిరోస్పేస్‌ టెక్నాలజీస్‌ కంపెనీ రిజిస్టర్‌.
*2011, మే : యుద్ధ విమానాల కోసం రఫెల్‌, యూరో జెట్‌ ఫైటర్స్‌ విమానాలను ఎంపిక చేసిన భారత వైమానిక దళం.
*2014, మార్చి 13 : 108 విమానాల తయారీ కోసం భారత ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌, డసాల్ట్‌ ఏవియేషన్‌ మధ్య 70:30 నిష్పత్తిలో ఒప్పందం.
*2014, ఆగస్టు 8 : ఒప్పందంలో భాగంగా 3-4 ఏళ్లలో పూర్తిగా తయారైన 18 విమానాలు ఇస్తారని, 108 విమానాలను ఏడేళ్లలో సమకూర్చుతారని పార్లమెంట్‌లో నాటి రక్షణ మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన.
*2015, ఏప్రిల్‌ 8 : యుద్ధ విమానాల తయారీ కోసం డసాల్ట్‌, రక్షణ శాఖ, హెచ్‌ఏఎల్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయని విదేశాంగశాఖ కార్యదర్శి ప్రకటన.
*2015, ఏప్రిల్‌ 10 : వినియోగానికి సిద్ధంగా ఉన్న 36 యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు కోసం కొత్త ఒప్పందం కుదిరినట్లు అధికారిక ప్రకటన.
*2016, జనవరి 26 : 36 రఫెల్‌ యుద్ధ విమానాల సరఫరా కోసం అవగాహనా ఒప్పందంపై భారత్‌, ఫ్రాన్స్‌ సంతకాలు.
*2016, నవంబర్‌ 18 : ఒక్కో రఫెల్‌ యుద్ధ విమానం ఖరీదు రూ.660 కోట్లు ఉంటుందని, అన్ని విమానాలను *2022 ఏప్రిల్‌ నాటికి అందిస్తారని పార్లమెంట్‌లో ప్రకటించిన ప్రభుత్వం.
*2016, డిసెంబర్‌ 31 : యుద్ధ విమానాల వాస్తవ చెల్లింపు ధర దాదాపు రూ.60 వేల కోట్లని డసాల్ట్‌ ఏవియేషన్‌ వార్షిక నివేదిక వెల్లడి.
*2018, మార్చి 13 : రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం.
*2018, సెప్టెంబర్‌ 5 : రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయం  
  • సుప్రీంకోర్టు నిర్ణయం.
*2018, అక్టోబర్‌ 8 : యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పంద వివరాలను సీల్ట్‌ కవర్‌లో పెట్టి సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన తాజా పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం.
*2018, అక్టోబర్‌ 10 : యుద్ధ విమానాల కొనుగోలు వివరాలు సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం.
*2018, అక్టోబర్‌ 24 : రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రశాంత్‌ భూషణ్‌ పిటిషన్లు.
*2018, అక్టోబర్‌ 31 : రఫెల్‌ యుద్ధ విమానల ఖరీదు వివరాలను 10 రోజుల్లోగా సీల్డ్‌ కవర్‌లో సమర్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం.
*2018, నవంబర్‌ 12 : సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో యుద్ధ విమానాల కొనుగోలు వివరాలను అందించిన కేంద్ర ప్రభుత్వం.
*2018, నవంబర్‌ 14 : రఫెల్‌ ఒప్పందం దర్యాప్తు పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తీర్పును వాయిదా వేసిన సుప్రీంకోర్టు.
*2018, డిసెంబర్‌ 14 : రఫెల్‌ ఒప్పందంపై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టేసి, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

views: 765

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams