Current Affairs Telugu Daily

కేంద్ర సమాచార కమిషనర్ ల పై ఫిర్యాదుల కమిటీ పై తీవ్ర అభ్యంతరాలు
*కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ)లో భాగమైన ప్రధాన సమాచార కమిషనర్‌, సమాచార కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
* ఇది సమాచార కమిషన్‌ స్వతంత్రతపై దాడేనని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం ఈ ప్రతిపాదనను సీఐసీకి పంపించగా ప్రధాన సమాచార కమిషనర్‌, సమాచార కమిషనర్లు మార్చి 27న సమావేశమై చర్చించారు.
*ప్రతిపాదనను వారందరూ ఏకగ్రీవంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసే బాధ్యతను ప్రధాన సమాచార కమిషనర్‌ సుధీర్‌ భార్గవకు అప్పగించినట్లు  తెలిపారు
  • ప్రారంభం : 12 October 2005.(సమాచార హక్కు చట్టం 2005)
  • కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ -  సుధీర్‌ భార్గవ
  • గరిష్ట సభ్యుల సంఖ్య-10+1
  • మొదటి కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ - Wajahat Habibullah.

views: 713

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams