Current Affairs Telugu Daily

ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 16 స్వర్ణాలు గెలుచుకుంది
* ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ 16 స్వర్ణాలు గెలుచుకుంది. తైపీలో జరిగిన ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 25 పతకాలు సాధించింది.
* అందులో ఐదు రజతాలు, నాలుగు కాంస్యాలు  ఉన్నాయి. పోటీల చివరి రోజు  భారత్‌ ఐదు పసిడి పతకాలు ఖాతాలో వేసుకుంది.
* జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో యశ్‌ వర్ధన్‌ (249.5 పాయింట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. *పురుషుల టీమ్‌ విభాగంలో యశ్‌, కేవల్‌, తోమర్‌ బృందం పసిడి సాధించింది.
* జూనియర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో యశ్‌-శ్రేయ జోడీ స్వర్ణం గెలుచుకుంది.
* జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో శ్రేయ.. టీమ్‌ విభాగంలో మెహూలి-కవి-శ్రేయ స్వర్ణాలు సాధించారు.

views: 726

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams