Current Affairs Telugu Daily

నిర్మాణదశలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల పై జీఎస్‌టీ గణనీయంగా తగ్గింపు
* జీఎస్‌టీ రేట్లను తగ్గించమంటూ ప్రభుత్వానికి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న జీఎస్‌టీ మండలి తన 33వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
*దీనిలో ప్రధానంగా నిర్మాణదశలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టుల జీఎస్‌టీ రేటును గణనీయంగా తగ్గించింది
* అందుబాటు గృహాలకైతే 1%, మిగతావాటికి 5 శాతం పన్ను రేట్లను వర్తింపజేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ పన్ను రేట్లు అమల్లోకి వస్తాయని చెప్పింది.
* ఇటీవల ముగిసిన జీఎస్‌టీ మండలి 34వ సమావేశంలో స్థిరాస్తికి సంబంధించి కొత్త జీఎస్‌టీ రేట్లపై చాలా వరకు స్పష్టత వచ్చింది. 
*జీఎస్‌టీ అమల్లోకి రాకముందు నిర్మాణదశలో ఉన్న స్థిరాస్తి ప్రాజెక్టులకు వ్యాట్‌, సేవా పన్ను కలిపి 6 శాతం పన్ను రేటు ఉండేది. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక అందుబాటు గృహాలకైతే 8%, ఇతరత్రా స్థిరాస్తులకైతే 12 శాతం మేర జీఎస్‌టీ రేటు ఉండేది.
* 2019 మర్చి 31 వరకు ఈ విధానమే కొనసాగింది. అయితే గతంలో 6 శాతంగా ఉన్న పన్ను రేటు జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక ఏకంగా రెట్టింపై 12 శాతానికి చేరడంతో స్థిరాస్తి అమ్మకాలు నెమ్మదించాయి

GST:
  • ఇది ఒక పరోక్ష పన్ను
  • మొదట ప్రస్తావించి నది: 2000 సం (వాజపేయి ప్రభుత్వం)
  • సూచించిన కమిటీ- కేల్కర్ కమిటీ
  • లోక్ సభ ఆమోదించింది: 2015
  • రాజ్యసభ ఆమోదించింది: 2016
  • రాష్ట్రపతి ఆమోదించింది: 2016 సెప్టెంబర్ 
  • అమలులోకి వచ్చిన తేదీ: 2017 జులై 1
  • GST రూప శిల్పి: అషీమ్ దాస్ గుప్తా
  • GST కౌన్సిల్ చైర్మన్: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams