Current Affairs Telugu Daily

గత ఆర్థిక సంవత్సరంలో రూ.25,828 కోట్ల టర్నోవర్‌ సాధించిన సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌
* సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం లో రూ.25,828 కోట్ల టర్నోవర్‌ సాధించింది. గత ఏడాది అమ్మకాల (రూ.21,323కోట్లు)తో పోలిస్తే 21శాతం వృద్ధి నమోదు చేసింది.
*2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ సాధించిన ప్రగతిని తెలియజేస్తూ సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌  ఒక ప్రకటన విడుదల చేశారు. గడిచిన సంవత్సరం మొత్తం 644 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది.
* 2017-18లో 10,422 రైల్వే ర్యేకుల ద్వారా బొగ్గు రవాణా జరపగా ఈసారి 12,372 ర్యేకులకు పెరిగింది.
సింగరేణి సమాచారం :
*స్థాపన : 23 December 1920.
*ప్రధానకార్యాలయంః కొత్తగూడెం 
*సీఎండీ- ఎన్‌.శ్రీధర్‌.
*సింగరేణి సంస్థ సంయుక్తంగా తెలంగాణ ప్రభుత్వం (51 శాతం) మరియు కేంద్ర ప్రభుత్వం (49 శాతం) యాజమాన్యంలో ఉంది.
 * ప్రస్తుతం 48 గనులను నిర్వహిస్తోంది, ఇందులో తెలంగాణలోని ఆరు జిల్లాలలో 19 ఓపెన్ కాస్ట్  మరియు 29 భూగర్భ గనులు ఉన్నాయి (AP యొక్క 4 జిల్లాలు) కలవు .
* మొదట  1871 లో, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  డాక్టర్ విలియం కింగ్, ఖమ్మం జిల్లాలోని ఇల్లందు సమీపంలోని బొగ్గును కనుగొన్నాడు
*ఆసియాలోనే అత్యంత విశ్వసనీయ సంస్థగా సింగరేణికి గుర్తింపు లభించింది
*అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి వాణిజ్య వ్యాపార సంప్రదింపుల సంస్థ అయిన బెర్క్‌ఫైర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చే ఇండియాస్ బెస్ట్ కంపెనీ-2018 అవార్డుకు సింగరేణి కాలరీస్ కంపెనీ ఎంపికైంది

views: 701

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams