Current Affairs Telugu Daily

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా విపిన్‌ ఆనంద్‌
*లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా విపిన్‌ ఆనంద్‌  బాధ్యతలు స్వీకరించారు.   ఆనంద్‌ గతం లో  ఎల్‌ఐసీ పశ్చిమ ప్రాంతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో 23 డివిజన్లు ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా రాష్ట్రాలు, డామన్‌, డయ్యూ, దాద్రా అండ్‌ నాగర్‌ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి.
* పాట్నా కేంద్రంగా ఉన్న ఎల్‌ఐసీ ఈస్ట్‌ సెంట్రల్‌ జోన్‌ బాధ్యతలూ ఆనంద్‌ చేపట్టారు. ఎల్‌ఐసీలోని వివిధ విభాగాల్లో 35 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
* సింగపూర్‌, బంగ్లాదేశ్‌ల్లో ఎల్‌ఐసీ కార్యకలాపాలు ప్రారంభించడంలో ఆనంద్‌ కీలక పాత్ర పోషించారు.
* LIC ప్రధాన కార్యాలయం: ముంబై
*స్థాపించబడినది: 1 సెప్టెంబరు 1956(LIC ACT 1956)
*ప్రస్తుతం 14 దేశాల్లో వివిధ శాఖలు కలిగి ఉన్నది (ఫిజీ,మారిషస్,ఇంగ్లాండ్,బెహ్రయిన్,నేపాల్,శ్రీలంక,సింగపూర్,బంగ్లాదేశ్ మొదలగు)
*LIC's slogan: yogakshemam vahaamyaham(Your welfare is our responsibility)

views: 702

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams