Current Affairs Telugu Daily

 రెండు గంటల వ్యవధిలో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూమి 9 సార్లు కంపించింది
*ఏప్రిల్ 2 న రెండు గంటల వ్యవధిలో అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూమి 9 సార్లు కంపించింది.  ఈ ఘటనల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
*ఉదయం 5.14గంటల సమయంలో తొలి భూకంపం రాగా, రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 4.9గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇది జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో భూ ప్రకంపన రిక్టర్‌ స్కేల్‌పై 5 తీవ్రతతో నమోదైంది.
*ఇలా చివరి సారి 6.54గంటల సమయంలో 5.2 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో చిన్నపాటి భూకంపాలు రావడం సాధారణం.
* ఇలా ఒకే రోజు రెండు లేదా మూడు కంటే ఎక్కువ సార్లు భూకంపాలు సంభవించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి.
*భారతదేశ భౌగోళిక గణాంకాల ప్రకారం దాదాపు 54% భూమి భూకంపాలకు అవకాశం ఉంది.
* 2050 నాటికి భారతదేశంలో సుమారుగా 200 మిలియన్ల మంది నగరవాసులు తుఫానులు మరియు భూకంపాలకు గురవుతారని ప్రపంచ బ్యాంకు మరియు యునైటెడ్ నేషన్స్ నివేదిక అంచనావేసింది 
*అండమాన్ నికోబార్‌ 5 వ భూకంపజోన్ 
*5వ జోన్: రిక్టర్ స్కేలు తీవ్రత 7 పాయింట్లు దాటిన భూకంప ప్రాంతం. ఇది అత్యంత అపాయకరమైన జోన్. ఇందులో ఉత్తర బిహార్, ఉత్తరాఖండ్ ఉత్తర భాగం, అన్ని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో కొంతప్రాంతం, అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్‌లోని కచ్, బుజ్ ప్రాంతాలు ఉన్నాయి
భారతదేశంలో భూకంపాల పర్యవేక్షణకు భారత వాతావరణ విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది.
* భారత వాతావరణ విభాగం నేషనల్ సిస్మలాజికల్ నెట్‌వర్క్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 55 అధ్యయన కేంద్రాలున్నాయి.
* మనదేశంలోని మెట్రో నగరాల్లో ఒక్క దిల్లీ మాత్రమే భూకంపాల పరిధిలో ఉంది.
* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద భూకంపం 1969 ఏప్రిల్ 13న కిచ్చెన్నపల్లి గొల్లగూడెం ప్రాంతంలో సంభవించింది. దీన్నే భద్రాచలం భూకంపం అంటారు.
* హైదరాబాద్ నగరం భూకంపాల తీవ్రతలో రెండో జోన్ పరిధిలో ఉంది.
  • Lieutenant Governo: Devendra Kumar Joshi
  • వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రమం- పోర్ట్ బ్లెయర్ 
  • భూకంపం అధ్యయనం సీస్మాలజీ అంటారు

views: 707

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams