Current Affairs Telugu Daily

దేశంలో మూడో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా
*నేటి నుంచి విజయాబ్యాంక్‌, దేనా బ్యాంక్‌లు  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం కానున్నారు.  బీవోబీ దేశంలో మూడు అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది. భవిష్యత్తులో దేనా బ్యాంక్‌, విజయాబ్యాంక్‌లు బీవోబీ శాఖలుగా పనిచేస్తాయి. విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌  కస్టమర్లను బీవోబీ కస్టమర్లుగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని మార్చి30న రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 
*ఈ విలీనం సాఫీగా జరిగేందుకు ప్రభుత్వం రూ.5,042కోట్లను బీవోబీలో పెట్టాలని నిర్ణయిచింది. అదనపు ఖర్చుల కోసం వీటిని కేంద్రం అందజేస్తోంది. ప్రతి 1000 విజయాబ్యాంక్‌ షేర్లకు 402 బీవోబీ షేర్లు లభిస్తాయి. అదే సమయంలో ప్రతి 1000 దేనా బ్యాంక్‌ షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో ఈ బ్యాంకుల విలీనం అంశాన్ని వెల్లడించింది.
* మూడు బ్యాంకుల సంయుక్త వ్యాపారం విలువ రూ.14.82 లక్షల కోట్లుగా నిర్ణయించారు.
* దేశంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తర్వాత ఈ బ్యాంకే అతిపెద్దది. బ్యాంకింగ్‌ సంస్కరణల్లో భాగంగా ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్‌లో 51శాతం వాటాను ఎల్‌ఐసీ కొనుగోలు చేసింది. దీంతోపాటు ఇప్పటికే పీఎస్‌బీల్లో ప్రభుత్వం రూ.1.06లక్షల కోట్ల మేరకు మూలధనాన్ని సమకూర్చింది. 
**విదేశాలలో ఎక్కువ శాఖలు కలిగిన రెండవ భారతీయ బ్యాంకు గా బరోడా (మొదటిది SBI )
*వీటి విలీనం వలన ప్రస్తుతం ప్రభుత్వరంగ సంస్థల సంఖ్య 17కు చేరింది 
  • Bank of Baroda Headquarters: Alkapuri, Vadodara
  • CEO: P. S. Jayakumar  
  • Founder: Sayajirao Gaekwad III
  • Nationalised on: 19 July 1969,

views: 679

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams