Current Affairs Telugu Daily

4 భాషల్లో ‘నా ఓటు’ యాప్‌
ఓటర్లకు సమాచారం, సేవలు అందించేందుకు తెలంగాణలో ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం రూపొందించిన ‘నా ఓటు’ యాప్‌ మార్చి 30 నుంచి అందుబాటులోకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటైన ఈ యాప్‌ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల భాషల్లో సేవలందిస్తుంది.
*గతంలో డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది. యాప్‌ ద్వారా పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గాల సమాచారంతో తమ పేరు జాబితాలో ఉందో లేదో ఓటర్లు  తెలుసుకోవచ్చు.
*ఎన్నికల అధికారులు; పోలింగ్‌ స్టేషన్ల సమాచారం,  పోటీచేసే అభ్యర్థుల వివరాలను పొందవచ్చు. దివ్యాంగ ఓటర్లు రవాణా సౌకర్యం కోరవచ్చు. పోలింగ్‌ కేంద్రాలకు ఎలా వెళ్లాలో యాప్‌ ద్వారా చూసుకోవచ్చు

views: 1000

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams