Current Affairs Telugu Daily

‘సీ-విజిల్‌’కు ఫిర్యాదుల వెల్లువ
ఎన్నికల నియమావళి (కోడ్‌) ఉల్లంఘనపై ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ-విజిల్‌ యాప్‌కి విస్తృత స్పందన లభిస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంలో కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి మార్చి 30 వరకు తెలంగాణవ్యాప్తంగా 850 ఫిర్యాదులొచ్చాయి.
*వీటిల్లో- అనుమతి లేకుండా పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటుచేయడంపై 278, ఆస్తుల ధ్వంసంపై 56, నగదు పంపిణీ పరంగా 29, మద్యం సరఫరాకు చెందినవి 26, బహుమతులు-ఇతర కూపన్ల అందజేతపై 20, అనుమతి లేని కాన్వాయ్‌, తదితర వాహనాలపై 15 ఉన్నాయి. కొన్ని వార్తాపత్రికలు, టీవీల్లో వచ్చిన కథనాలను చెల్లింపు వార్తలుగా పరిగణించాలంటూ వచ్చినవాటిల్లో 21 ఫిర్యాదులు సరైనవి కావని అధికారులు తిరస్కరించారు.
*సీ-విజిల్‌కు వచ్చిన అన్నింటిలోనూ 288 నిరాధారమైనవని గుర్తించారు. స్వీకరించిన 539లో 516 ఫిర్యాదులను పరిష్కరించారు. మరో 23 విచారణ దశలో ఉన్నాయి.
*ఫిర్యాదులు అత్యధికంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి 218, అత్యల్పంగా వరంగల్‌ రూరల్‌ నుంచి ఒకటి వచ్చాయన్నారు. ఇతర జిల్లాల్లో అందిన ఫిర్యాదుల సంఖ్య ఇదీ: నిజామాబాద్‌ 107, జగిత్యాల 71, నిర్మల్‌ 59, హైదరాబాద్‌ 46, రంగారెడ్డి 43, మేడ్చల్‌ మల్కాజిగిరి 31, వికారాబాద్‌ 23, వనపర్తి 23.
  •  'cVIGIL' stands for Vigilant Citizen and emphasizes the proactive and responsible role citizens can play in conduct of free and fair elections.

views: 969



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams