Current Affairs Telugu Daily

అల్లం నారాయణకు జస్టిస్‌ ఆవుల సాంబశివరావు పురస్కారం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా అందజేసే  జస్టిస్‌ ఆవుల సాంబశివరావు పురస్కార సభ మార్చి 30 న జరిగింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం వర్సిటీలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో 2019వ సంవత్సరానికి పురస్కారాన్ని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణకు ప్రదానం చేశారు. జీవితంలో ఇలాంటి అవార్డు పొందడం ఇదే మొదటిసారంటూ నారాయణ ఉద్వేగానికి లోనయ్యారు. అప్పటి ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో తనతో కలిసి నడిచిన తొలినాటి మిత్రులు, ఉద్యమకారులు, సహచర పాత్రికేయులు, అమరులైనవారందరికీ ఈ పురస్కారం చెందుతుందన్నారు

views: 906

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams