Current Affairs Telugu Daily

ఘనంగా అమరావతి ఐటీ ఫెస్ట్‌ 2019
ఆంధ్రప్రదేశ్‌ ఐటీ సమాఖ్య (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌-ఐటీఏఏపీ) ఆధ్వర్యంలో విజయవాడ సమీపం కానూరులోని వి.ఆర్‌.సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో మార్చి 30 న ‘అమరావతి ఐటీ ఫెస్ట్‌-2019’ వైభవంగా జరిగింది.
రాజధాని పరిధిలో గత నాలుగేళ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన 98 ఐటీ సంస్థలకు చెందిన 78 స్టాళ్లను ఫెస్ట్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐటీఏఏపీ ప్రతినిధి శ్రీధర్‌ కొసరాజు మాట్లాడుతూ విభజన అనంతరం ఐటీ సంస్థలు పెద్దఎత్తున ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని 35వేల మంది యువత ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు. వారందరినీ ఒకేచోటికి చేర్చాలనే ఉద్దేశంతో తొలిసారిగా అమరావతి ఐటీ ఫెస్ట్‌ను ఏర్పాటు చేశామన్నారు.

views: 943

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams