Current Affairs Telugu Daily

తెలంగాణ శాసనమండలిలో 8 మంది కొత్త సభ్యులు
తెలంగాణలో శాసనసభ్యుల కోటా, పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల స్థానాల నుంచి కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది శాసనమండలి సభ్యులపై కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. శాసనసభ్యుల కోటా నుంచి తెరాసకు చెందిన మహమూద్‌అలీ, శేరి సుభాష్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, సత్యవతి రాఠోడ్‌లు, మీర్జా రియాజుల్‌ హసన్‌ అఫెండీ (మజ్లిస్‌) గెలిచారు.
*కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి, వరంగల్‌-ఖమ్మం-నల్గొండఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డిలు ఎన్నికయ్యారు. వీరిని స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ పట్టభద్ర నియోజకవర్గం నుంచి జీవన్‌రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన్ను కాంగ్రెస్‌ సభ్యునిగా పేర్కొంది.

views: 864Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams