Current Affairs Telugu Daily

ఈ-లెర్నింగ్‌ శిక్షణలో తెలంగాణకు మొదటి స్థానం

ప్రభుత్వ ఉద్యోగులకు ఈ-లెర్నింగ్‌ శిక్షణలో వరుసగా రెండో ఏడాదీ తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) అధికారులు వెల్లడించారు.
*2018-19 ఆర్థిక సంవత్సరంలో 20వేల మంది ప్రభుత్వ సిబ్బంది ఈ-లెర్నింగ్‌పై శిక్షణ పొందినట్లు తెలిపారు. వికేంద్రీకరణ విధానంతో జిల్లా పరిపాలనా విభాగం, ప్రాంతీయ శిక్షణ కేంద్రాలు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించడంతోనే విజయవంతమైందని తెలిపారు.
*అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోనూ 20 వేలమంది శిక్షణతో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం నిర్దేశించిన విధంగా కార్యాలయ విధానాలు, అకౌంట్స్‌, సమాచార హక్కు చట్టం, సమీకృత అభివృద్ధి లక్ష్యాలపై వివిధ శాఖల ఉద్యోగులకు ఈ-లెర్నింగ్‌ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.


views: 798

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams