Current Affairs Telugu Daily

ఐపీఎల్‌లో క్రిస్‌గేల్‌ మరో రికార్డు

ఐపీఎల్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ రికార్డు సృష్టించాడు. మార్చి 30న ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్‌ ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకూ అతడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల తరపున ఆడగా, మొత్తం 114 ఇన్నింగ్స్‌ల్లో 300 సిక్సులు కొట్టాడు. గేల్‌ 37 ఇన్నింగ్స్‌ల్లో మొదటి 100 సిక్సులు, 69 ఇన్నింగ్స్‌ల్లో 200 సిక్సులు,  114 ఇన్నింగ్స్‌ల్లో 300 సిక్సులు కొట్టాడు. మొత్తం 300 సిక్సులు కొట్టడానికి అతడు 2719 బంతులు ఎదుర్కొన్నాడు.

*గేల్‌ తర్వాత 192 సిక్సులతో ఏబీ డివిలియర్స్‌(రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు) ఉన్నాడు. అతడు 131 ఇన్నింగ్స్‌ల్లో 192 సిక్స్‌లు కొట్టాడు.
*మూడో స్థానంలో చెన్నై ఆటగాడు ధోని ఉన్నాడు. ధోని 159 ఇన్నింగ్స్‌ల్లో 187 సిక్సులు కొట్టాడు. 


views: 749

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams