Current Affairs Telugu Daily

దేశంలోనే మొదటిసారి బ్రెయిలీలో ఓటింగ్ 
కంటి చూపు లేని కారణంగా ఓటింగ్ దూరమవుతున్న అంధులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. బ్రెయిలీ లిపి ద్వారా వారు ఓటు వేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. *ఈ కొత్త విధానాన్ని మొదటిసారి మేఘాలయలో ప్రవేశపెట్టనుంది. దానివల్ల 800 మందికి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొనే అవకాశం ఉందని ఆ రాష్ట్ర  ఎన్నికల అధికారి ఎఫ్ఆర్ ఖర్కోగోర్‌ వెల్లడించారు. 
*ఈవీఎంల మీద బ్రెయిలీ లిపిలో ఉన్న బ్యాలెట్ పత్రాలను అంటిస్తామని, వాటిని ప్రత్యేక అవసరాలున్న ఓటర్లు సులభంగా గుర్తించగలరని ఆయన పేర్కొన్నారు.
*ఎన్నికల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా ఓటు వేసేందుకు క్యూ మేనేజ్‌మెంట్ యాప్‌ను కూడా తీసుకువచ్చామని వెల్లడించారు.
  • Meghalaya Capital: Shillong
  • Governor: Tathagata Roy
  • Chief minister: Conrad Sangma
  • Chief Electoral Officer: F R Kharkongor

views: 799



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams