Current Affairs Telugu Daily

మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్‌
 మూడు ప్రభుత్వ రంగ బ్యాంకు లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్‌, దేనాబ్యాంక్‌ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, న్యాయమూర్తి వినీత్‌ శరణ్‌ నేతృత్వంలోని డివిజనల్‌ బెంచ్‌, ఈ అంశంపై తక్షణం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇది పూర్తిగా ఆర్థికవిధానాలనకు సంబంధించిన అంశంగా పేర్కొంది.
*విజయా, దేనా బ్యాంకులు ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం కానున్నాయి. దీనితో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ  తర్వాత మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఆవిర్భవించనుంది.

views: 802



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams