Current Affairs Telugu Daily

మూడు లక్షల కంపెనీల వ్యవహారాలను పరిశీలించాలని ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)  స్థానిక ఆదాయపు పన్ను ఆఫీసులకు నోటీసులు జారీ
నోట్ల  రద్దు తర్వాత మనీలాండరింగ్‌కు, పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అనుమానం ఉన్న మూడు లక్షల కంపెనీల వ్యవహారాలను పరిశీలించాలని ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)  స్థానిక ఆదాయపు పన్ను ఆఫీసులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే వివిధ కారణాలతో ప్రభుత్వం వీటి రిజిస్ట్రేషన్లను రద్దు చేసింది. 
‘‘ఈ కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించండి. డిపాజిట్లను, విత్‌డ్రాలను పూర్తిగా పరిశీలించాలి. ముఖ్యంగా నోట్ల రద్దు సమయంలో వీటి వ్యవహారాలను పరిశీలించండి’’ అని సీబీడీటీ తెలియజేసింది. 
ఈ కంపెనీల్లో చాలా వరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. ఒక సారి చర్యలు చేపడితే ఆదాయపన్ను శాఖ చర్యలు చేపడుతుంది. పన్ను నేరాలపై ఈడీ విచారణలో ఉన్న కేసుల్లో కూడా మనీలాండరింగ్‌ అంశంపై దర్యాప్తు జరపాలని తాము కోరినట్లు సీబీడీటీ అధికారి ఒకరు తెలిపారు. 
  • CBD: Central Board of Direct Taxes
  • Chairperson of CBDT: Pramod Chandra Mody

views: 729



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams