Current Affairs Telugu Daily

మూడోసారి బ్రెగ్జిట్‌ బిల్లును తిరస్కరించిన బ్రిటన్‌ పార్లమెంటు
మూడోసారి కూడా బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే తెచ్చిన బ్రెగ్జిట్‌ బిల్లును ఆ దేశ పార్లమెంటు తిరస్కరించింది. దీంతో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకొచ్చే పద్ధతి మరింత సంక్లిష్టమైంది.
మే తెచ్చిన తాజా బిల్లుకు పార్లమెంటులో అనుకూలంగా 286 ఓట్లు, వ్యతిరేకంగా 344 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే బ్రెగ్జిట్‌కు సంబంధించిన అన్ని బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు థెరెసాకు మే 22వ తేదీ వరకు సమయం దొరికేది. గత ప్రణాళిక ప్రకారం మార్చి 29 నుంచే బ్రెగ్జిట్‌ ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. బ్రెగ్జిట్‌ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందక పోవడంతో అది వాయిదా పడింది
*బ్రిటన్‌ ప్రధానిః థెరెసా మే
*కరెన్సీ:పౌండ్ స్టెర్లింగ్

views: 688



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams