Current Affairs Telugu Daily

భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు
*ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ షూటర్ల జోరు కొనసాగుతోంది. పోటీల రెండోరోజు మార్చి 28న భారత్‌ ఒక స్వర్ణం, రెండు రజతాలు ఖాతాలో వేసుకుంది.
* తైపీలో జరుగుతున్న ఈ టోర్నీలో జూనియర్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో శ్రేయ అగర్వాల్‌, యశ్‌ వర్దన్‌ జోడీ స్వర్ణం గెలుచుకుంది
* సీనియర్‌ 10 మీ ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో రవికుమార్‌, ఇలవేణిల్‌ జోడీ రజతం గెలిచింది. ఫైనల్లో ఈ జంట (498.4) ద్వితీయ స్థానంలో నిలిచింది.
 * సీనియర్‌ 10 మీ ఎయిర్‌ పిస్టల్‌లో మనుబాకర్‌-సౌరభ్‌ చౌదరి జోడీ స్వర్ణం సాధించగా, జూనియర్‌ 10 మీ ఎయిర్‌పిస్టల్‌లో ఇషా సింగ్‌-విజయ్‌ వీర్‌ పసిడి గెలుచుకున్నారు. మొత్తం 5 పతకాలతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
*ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌  తైపీలోని తావోయువాన్‌లో జరుగుతుంది.

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams