Current Affairs Telugu Daily

తొలిసారిగా హెచ్‌ఐవీ దాత నుంచి అవయవ మార్పిడి
*హెచ్‌ఐవీ బాధితురాలి మూత్రపిండాన్ని మరొక రోగికి విజయవంతంగా అమర్చారు. తొలిసారిగా అమెరికా బాల్టిమోర్‌లోని వైద్యులు ఈ శస్త్రచికిత్సను చేపట్టారు.
* కొత్త అవయవాలు అవసరముండే ఎయిడ్స్‌ బాధితుల విషయంలో ఈ శస్త్రచికిత్స ఒక మైలురాయిగా నిలువనుంది.
*అట్లాంటాకు చెందిన నీనా మార్టినెజ్‌ జాన్స్‌హాప్కిన్స్‌ యూనివర్సిటీకి వెళ్లి హెచ్‌ఐవీ పాజిటివ్‌ బాధితులకు తన మూత్రపిండాన్ని దానం చేసేందుకు సుముఖం వ్యక్తం చేశారు. ఇతరుల జీవితంలో కొంత మార్పును తీసుకురావాలని,  హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌ విషయంలో నెలకొన్న అపోహలను తొలగించాలనేవి తన లక్ష్యాలని పేర్కొన్నారు.
*మార్చి25 న అవయవ మార్పిడి శస్త్రచికిత్స పూర్తయింది. దాత మార్టినెజ్‌తోపాటు అవయవ స్వీకర్త ఆరోగ్యంగా ఉన్నారని హాప్కిన్స్‌ సంస్థ వెల్లడించింది.
 *ఈ తరహా అవయవ మార్పిడి ప్రపంచంలోనే మొదటిదని మార్పిడి ప్రక్రియను పర్యవేక్షించిన డా.డోరీ సెగెవ్‌ తెలిపారు. 
*అమెరికాలో హెచ్‌ఐవీ బాధితుల మధ్య అవయవ మార్పిడిని నిషేధించిన హోప్‌ చట్టాన్ని ఎత్తి వేసేందుకు ఆయన ఉద్యమించారు. 
*1981 లో, CDC US లో AIDS అంటువ్యాధి యొక్క మొట్టమొదటి సారిగా ఫ్రాన్సిస్కో నివాసి కెన్ హార్న్ రోగిగా గుర్తించారు.
*World AIDS Day- 1 December 

views: 711

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams