Current Affairs Telugu Daily

కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది- మోదీకి ఐరోపా పార్లమెంటు సభ్యుల లేఖ

 *జమ్మూకశ్మీర్‌లో ఆందోళనకారులను నియంత్రించేందుకు పెల్లెట్‌ తుపాకుల వినియోగాన్ని నిలిపి వేయాలని, సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్పీఏ), ప్రజాభద్రత చట్టం (పీఎస్‌ఏ) వంటి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఐరోపా పార్లమెంటుకు చెందిన 50 మంది సభ్యులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.
* కశ్మీర్‌లో గతంలో, ప్రస్తుతం జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తం చేసేందుకు లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంయుక్త లేఖను మార్చి 25వ తేదీతో ప్రధానికి రాశారు.

*షోపియన్‌ జిల్లాలో పెల్లెట్‌ బాధిత 19 నెలల చిన్నారి ఉదంతాన్ని అందులో ప్రస్తావించారు. భద్రతా బలగాలు  మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినా ఏఎఫ్‌ఎస్పీఏ, పీఎస్‌ఏ కారణంగా విచారణ నుంచి రక్షణ లభిస్తోందని ఆరోపించారు. పెల్లెట్‌ తుపాకీ కాల్పులకు సంబంధించిన ఘటనలపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తులను జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
*జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రస్తుత గవర్నర్- నరిందర్ నాథ్ వోరా


views: 671

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams