Current Affairs Telugu Daily

ఏసీజేగా జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ 
*హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ నియమితులయ్యారు. ఆయన్ను ఏసీజేగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. 
* ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేసినారు. 
* దీంతో హైకోర్టులో నంబర్‌ 2 స్థానంలో ఉన్న జస్టిస్‌ చౌహాన్‌ ఏసీజేగా నియమితులయ్యారు.
*రాజస్థాన్  చెందిన జస్టిస్‌ చౌహాన్‌ గత ఏడాది నవంబర్‌ 21న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు.
*1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.
* 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్తాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
* 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు . 

views: 897

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams