Current Affairs Telugu Daily

అమెరికా క్షిపణి ప్రదర్శన
ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ICBM)ని ప్రయోగించడానికి ప్రతిగా దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా 2017 జులై 4న క్షిపణి ప్రదర్శన నిర్వహించాయి. ధిక్కార ధోరణిని అవలంభిస్తున్న ఉత్తర కొరియాకు తమ బలమేంటో చూపడానికి దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లోకి క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఆర్మీ టాక్టికల్‌ మిసైల్‌ సిస్టం(ATacMS), దక్షిణ కొరియాకు చెందిన హ్యున్మూ మిసైల్‌ 2ను ఈ కసరత్తులో వినియోగించినట్లు దక్షిణ కొరియాలోని అమెరికా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
ICBM-Inter Ccontinental Ballistic Missile
ATacMS-Army Tactical Missile System
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం ` జులై 4

views: 1073



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams